ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు. తన కుటుంబాన్ని 37 రోజులుగా ఎంతో మిస్ అయ్యానంటూ ఎమోషనల్ అయ్యారు. ‘నా కుటుంబం, శ్రేయోభిలాషుల పార్థనలు నన్ను ఇవాళ ఇక్కడకు చేర్చారు. నిజాన్ని ఎవరూ కప్పి పుచ్చలేరు. ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుంది. అండగా నిలిచిన కుటుంబానికి నేను కృతజ్ఞతతో ఉంటాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా.. అత్యాచార ఆరోపణలతో ఖైదీగా ఉన్న మాస్టర్ బెయిల్‌పై విడుదలయ్యారు.