కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణకు ప్రత్యేక న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 2009-2010 సమయంలో సీజ్ చేసిన ఉక్కును అక్రమంగా తరలించారనే అభియోగాలను ఆయన ఎదుర్కొంటున్నారు. దీనిపై పలు విడతలుగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఎమ్మెల్యేలతో పాటు మరో ఆరుగురు నిందితులకు శిక్ష ఖరారు చేసింది.