రోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడంలో రాత్రి భోజనం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, చాలామంది డైటింగ్ పేరుతో రాత్రి భోజనాన్ని స్కిప్ చేస్తుంటారు. కానీ, రాత్రి వేళలో ఆహారం మానేస్తే శరీర బరువు తగ్గకపోగా, అధిక బరువు పెరిగే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో నిద్రిస్తే శరీరంలో విడుదలయ్యే యాసిడ్స్ జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. భోజనం చేయకపోతే శరీరంలోని శక్తి విలువలు తగ్గి నీరసానికి గురవుతారు.