BDK: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అధికారులకు సూచించారు. శనివారం ఇల్లందు పోలీస్ స్టేషన్ సందర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపాలని కోరారు.