కృష్ణా: సింహాద్రిపురం మండలం నంద్యాలం పల్లె గ్రామానికి చెందిన వై వెంకట్ మహేశ్వర్ రెడ్డిపై శుక్రవారం రాత్రి దాడి చేసిన కేసులో, ఐదు మందిపై కేసు నమోదు చేసినట్లు ఇంఛార్జ్ ఎస్ఐ ఎస్ఎండీ షరీఫ్ తెలిపారు.శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూబాధితుడి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందినఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.