12 ఏళ్ల తరువాత సొంత గడ్డపై భారత్‌కు కివీస్ ఓటమి రుచి చూపించింది. విదేశీ జట్లను స్పిన్ అస్త్రంతో దెబ్బకొట్టే టీమిండియా ఈసారి అదే స్పిన్ ఉచ్చుకు బలైంది. బెంగుళూరులో పిచ్‌ను పేస్‌కు అనుకూలంగా మల్చుకుంది. అయితే ఆ ప్రయోగం బెడిసికొట్టడంతో పూణెలో మళ్లీ స్పిన్ పిచ్ వైపు మొగ్గు చూపింది. కివీస్‌ను స్పిన్‌తో కట్టిపడేయాలని ఉచ్చు వేసినా.. ప్రత్యర్థి విసిరిన అదే వలలో భారత జట్టు చిక్కుకుంది.