ప్రకాశం: హనుమంతునిపాడు ప్రధాన రహదారిలో వాహన తనిఖీలను మండల ఎస్సై మాధవరావు శనివారం సాయంత్రం చేపట్టారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు సరైన పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. సరైన పత్రాలు లేని వారికి ఈ చలానా జరిమాణాలు విధించడం జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పని హెచ్చరించారు.