TG: రాజ్యాంగ విరుద్ధంగా EWS రిజర్వేషన్ తెచ్చారని BC సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ వెల్లడించారు. అగ్రవర్ణాల మెప్పు కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. BC ప్రధాని అయిన మోదీ BCలకు ఏం చేశారని ప్రశ్నించారు. BJP గోడ మీద పిల్లి వైఖరి వీడాలని పేర్కొన్నారు. EWS రిజర్వేషన్ పాపం మోదీ, KCRలదేనని తెలిపారు. తెలంగాణ మాదిరిగానే దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్ చేశారు.