TG: రాష్ట్రంలో జరిగే మేడారం జాతరకు దేశంలోనే గుర్తింపు ఉంది. కాగా, మేడారం మినీ జాతర తేదీలను ఇవాళ సమ్మక్క-సారలమ్మ పూజారులు ప్రకటించారు. 2025 ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జాతరను నిర్వహించనున్నారు. జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. కానీ, గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయనున్నారు. అయితే, రెండేళ్లకోసారి మేడారం మహాజాతర జరుగుతుంది.