TG: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతుంది. ఇవాళ విచారణకు CE సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల టెండర్లపై విచారణ చేపట్టారు. తనిఖీలు లేకుండానే మేడిగడ్డకు సబ్ స్టాన్షియల్ పత్రం ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. అలాగే, ఈ విచారణలో మాజీ మంత్రి హరీశ్ రావు పేరు 3 సార్లు ప్రస్తావించారు. అప్పటి ఇరిగేషన్ మంత్రి ఎవరని ప్రశ్నించగా హరీశ్ రావు పేరు చెప్పినట్లు సమాచారం.