TG: కేబినెట్ విస్తరణ అధిష్టానం, సీఎం చేతుల్లో ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కొత్త, పాత కలయికతో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. పార్టీలో చేరికలు ఆగలేదు, రాష్ట్ర ఆదాయం తగ్గలేదని పేర్కొన్నారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని, చేరికల విషయంలో జీవన్ రెడ్డితో మాట్లాడామని అన్నారు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందన్నారు. పొంగులేటి పొలికల్ బాంబ్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.