NZతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు అర్థశతకంతో మెరిశాడు. ఈ క్రమంలో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో సొంతగడ్డపై టెస్టులో వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏడో బ్యాటర్‌గా.. అలాగే మూడో భారత క్రికెటర్‌గా చరిత్రలో నిలిచాడు. ఈ జాబితాలో ఇండియా తరపున గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్ మాత్రమే ఉన్నారు.