ప్రకాశం: హనుమంతుని పాడులో పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా ఎస్సై మాధవరావు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పోలీసు విధులపై అవగాహన కల్పించి పనితీరును విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు