పుణె వేదికగా NZతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవి చూసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ దీనిపై స్పందించాడు. టెస్టు సిరీస్ కోల్పోవడం బాధను కలిగించిందన్నాడు. బ్యాటర్ల వైఫల్యంతోనే మ్యాచ్ ఓడిపోయామని.. న్యూజిలాండ్ అద్భుతంగా ఆడిందని ప్రశంసించాడు. వాంఖడే వేదికగా జరిగే మూడో టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా భారత్లో కివీస్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.