హిట్ మ్యాన్‌గా మంచి పేరును సంపాందించుకున్న రోహిత్ శర్మ టెస్టుల్లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్నటెస్టు సిరీస్‌లో కూడా ఆయన పెద్దగా రాణించట్లేదు. కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో (0),(8) పరుగులకే పరిమితమయ్యారు. గత 8 టెస్టుల్లో కేవలం ఒక్క అర్థసెంచరీని మాత్రమే నమోదు చేశారు. దీంతో టీమ్ కోసం బాధ్యతగా ఆడాల్సిన కెప్టెనే ఇలా ఆడటంపై క్రీడాభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.