TG: భారతదేశంలో భవిష్యత్ హైదరాబాద్దేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంచినీటి ఎద్దడి లేకుండా గోదావరి, కృష్ణ, మంజీరా నదుల నుంచి తాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలనే ఆలోచనలతో సీఎం, రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని భట్టి పేర్కొన్నారు.