VZM: జిల్లా రెవెన్యూ అధికారిగా ఎస్ శ్రీనివాసమూర్తి శనివారం కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు ఆయన శ్రీ పైడితల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇప్పటివరకు పనిచేసిన ఎస్.డి.అనిత శనివారం బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు.