సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. బెంగళూరు టెస్టులో ఓడిపోయిన భారత్.. తాజాగా పుణె టెస్టులోనూ ఓటమి చెందడంతో మూడు టెస్టుల సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయింది. 359 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో 60.2 ఓవర్లలో 245 పరుగులకు రోహిత్ సేన ఆలౌటైంది. ఓపెనర్ జైస్వాల్ (77) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో శాంట్నర్ 6 వికెట్లు, అజాజ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.
Tags :