TG: మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటే ప్రజలు తిరగబడతారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళనను విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ.. మూసీ పునర్జీవానికి మద్దతుగా నల్గొండ కాంగ్రెస్ నేతలు మహాధర్నా చేపట్టారు. ఎంపీ చామల, ఎమ్మెల్యే అనిల్ ఈ ధర్నాలో పాల్గొని రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.