PLD: ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు వినుకొండలో విశేష స్పందన లభిస్తోంది. శనివారం స్థానిక శివయ్య స్తూపం సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలంతా ఓటు నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు.