AP: జగన్ కుటుంబ వివాదంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం టీడీపీకి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్ క్యారెక్టర్ ఏంటో దేశమంతా అర్థమైందని వెల్లడించారు. తల్లికి కుమారుడికి మధ్య ఆస్తుల ఎంఓయూ ఉంటుందని దేశంలో తొలిసారిగా తెలిసిందని పేర్కొన్నారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని మంత్రి నిమ్మల ప్రశ్నించారు.