AP: రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఏర్పడిందని MP శ్రీ భరత్ అన్నారు. వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ‘పెట్టుబడి విధానాల ప్రోత్సాహం, అవకాశాలు’ అనే అంశంపై విశాఖపట్నంలో సదస్సు జరిగింది. రాష్ట్రంలో ప్రతి రంగం పురోగతి కోసం ఎదురుచూస్తోందని.. ఈ సదస్సులో భరత్ అన్నారు. వివిధ రంగాల ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేందుకు పనిచేస్తున్నామన్నారు.