ఢిల్లీలోని ఏపీ భవన్లో దీపావళి పండగ సందర్భంగా హ్యాండీ క్రాప్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. నవంబర్ 2వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఇందులో చేనేత వస్త్రాలు, కళాకృతుల ప్రదర్శన, అమ్మకం తదితర ప్రత్యేక ఉత్పత్తులతో జిల్లాకు ఒక స్టాల్ చొప్పున 21 స్టాళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా తెలుగు వంటకాలతో మరికొన్ని స్టాల్స్ ప్రదర్శించారు.