గతంలో ఆకాశవాణిలో పని చేసినట్లు సీజేఐ జస్టిన్ డీవై చంద్రచూడ్ తెలిపారు. తాను 19 ఏళ్ల వయసులోనే ఆకాశవాణిలో పని చేశానన్న చంద్రచూడ్.. దానితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. రేడియో స్టేషన్లోని కొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించినట్లు తెలిపారు. చిన్ననాటి నుంచి రేడియోలో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో వచ్చే వార్తలు వినేవాడినంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.