NRML: దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ క్యాంపు ను శనివారం ఎంపీవో గోవర్ధన్ సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ తీరును పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామంలోని సిగ్రిగేషన్, నర్సరీలను పరిశీలించారు. ప్రతిరోజు తడి పొడి చెత్తను వేరువేరుగా చేసి ఎరువును తయారు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.