న్యూజిలాండ్‌తో జరుగుతున్న పుణె టెస్టులో టీమిండియా తుది జట్టు ఎంపికపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి టెస్టులో KL రాహుల్ విఫలమవడంతో అతడి స్థానంలో గిల్‌ను జట్టులోకి తీసుకొచ్చారు. కానీ గిల్ కూడా రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 53 పరుగులు మాత్రమే చేసి పేలవ ప్రదర్శనను కనబరిచాడు. దీంతో రాహుల్ చేయలేంది గిల్ ఏం చేశాడంటూ.. క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.