దేశంలోనే అత్యధిక మెడికల్ కళాశాలలు ఉన్న రాష్ట్రంగా కర్ణాటకకు పేరుంది. కాగా, ఈ ఏడాది వైద్యారోగ్యశాఖ 623 మంది నకిలీ డాక్టర్లను గుర్తించింది. కోలారు, విజయపుర, తుమకూరు ప్రాంతాల్లోనే బోగస్ డాక్టర్లు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. మండ్యతోపాటు పలు ప్రాంతాల్లో ఆస్పత్రి, ల్యాబ్‌లు లేని చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసి భ్రూణహత్యలు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే 2 వేలకుపైగా క్లినిక్‌లు, ల్యాబ్‌లకు తాళాలు వేశారు.