NLG: నేరడుగొమ్ము మండలం వైజాక్ కాలని గ్రామ మాజీ సర్పంచ్ దూడ బావోజీ తల్లి దూడ అమ్మారమ్మ మృతి బాధాకరం అని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం నేరడుగొమ్ము మండలం వైజాక్ కాలనీలో ఆమె మృతి దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.