E.G: రాజమండ్రిలోని ARTS కళాశాలలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నట్లు చెప్పారు. సుమారు 5 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఈ మెగా జాబ్ మేళా నిర్వహించామన్నారు.