KMM: TS ATF సంఘం ఆధ్వర్యంలో పాకాల కొత్తగూడం పర్యటనకు వచ్చిన మంత్రి దనసరి సీతక్కను ఆదివాసీ పోడు రైతులు, డీఎస్సీ అభ్యర్థులు కలిసారు. ఆదివాసి పోడు భూములపై హక్కు పత్రాలు ఉండి, రైతుబంధు వస్తున్నప్పటికీ పూర్తిస్థాయి హక్కులు కల్పించాలని కోరారు. డీఎస్సీ 2008 సం. 70:30 కోటా వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని మంత్రిని వారు కోరారు.