కుటుంబ తగాదాలపై TDPకి అంత ఆసక్తి ఎందుకు? అని వైసీపీ ప్రశ్నించింది. ‘నాణేనికి ఒకవైపే చూపించి ప్రజలను పక్కదోవ పట్టించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి?. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి దిగాలనే లక్ష్యం కాదంటారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఘోరమైన పాలనా వైఫల్యం నుంచి ఆగ్రహంతో ఉన్న ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ కాదా? అని ప్రశ్నించింది.