వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా మహాసముద్రాలు వేడెక్కుతున్నాయి. తూర్పుతీరంలో మత్స్యకారుల జీవనోపాధిపై దీని ప్రభావం పడుతోంది. చుట్టూ ఉన్న దేశాలన్నీ ఎక్కువ జనాభా కలవి కావడంతో కర్బన ఉద్గారాలు ఈ వేడికి కారణమవుతున్నాయి. హిందూ మహాసముద్రంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు 25-31 డిగ్రీల మధ్యలో నమోదవుతాయి. భూతాపం కారణంగా అక్కడ సగటున ఏడాదికి 0.02 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీంతో సముద్రంలో వేడి వల్ల చేపల ప్రత్యుత్పత్తి సమయం మారిపోతోంది.