TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు షాక్ తగిలింది. వారిద్దరి పాస్‌పోర్టులను అధికారులు రద్దు చేశారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ అమెరికాలో ఉండటంతో వారికోసం అక్కడి పోలీసులను HYD పోలీసులు సంప్రదిస్తున్నారు. వారిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ముమ్మర యత్నం జరుగుతోంది. సీబీఐ ఇప్పటికే ఇంటర్ పోల్‌కు నివేదిక పంపింది.