హీరోయిన్స్ కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడంపై బాలీవుడ్ నటి కృతి సనన్ కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలు ఎప్పుడూ అందంగా కనిపించాలని వారిపై ఒత్తిడి తీసుకురాకూడదని చెప్పింది. కాస్మోటిక్ సర్జరీలు చేయించుకునే వారి విషయంలో తాను జడ్జ్మెంట్ ఇవ్వలేనని, శరీరంలో ఓ భాగంలో మార్పు రావడం వల్ల అందం వస్తుందంటే నమ్మనని పేర్కొంది. మానసికంగా ఆనందంగా ఉంటే మన ముఖంలో అదే కనిస్తుందని, ఈ విషయంలో తాను ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదని తెలిపింది.