కోనసీమ: టీడీపీ పార్టీ సభ్యత్వం కార్యకర్తల కుటుంబానికి భరోసా అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం వాడపాలెం గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీకి అండగా ఉంటున్న కార్యకర్తల కోసం పార్టీ కృషి చేస్తుందన్నారు. వంద రూపాయలతో సభ్యత్వం తీసుకున్నవారికి 5 లక్షల ప్రమాద బీమా వస్తుందన్నారు.