ద.మ రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. రెండు రోజులపాటు సికింద్రాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇవాళ సికింద్రాబాద్ నుంచి బయల్దేరే(12710) రైలును రద్దు చేయగా.. ఆదివారం గూడూరు నుంచి సికింద్రాబాద్కు వచ్చే (12709) రైలు కూడా రద్దయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆయా రోజుల్లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులకు డబ్బు వాపసు చేయనున్నట్లు వెల్లడించారు.