TG: ఆన్లైన్లో డ్రగ్ ఇంజెక్షన్లు అమ్ముతున్న ఏడుగురు సభ్యుల ముఠా HYDలో అరెస్టైంది. ఈ ముఠాని టీజీన్యాబ్ అదుపులోకి తీసుకుంది. నిందితులు బిహార్లోని హాజీపూర్ కేంద్రంగా దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సరస్వతి ఎంటర్ప్రైజెస్ పేరిట ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్ పేరుతో విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ-కామర్స్ వైబ్ సైట్ల ద్వారా మత్తు ఇంజక్షన్ల అమ్మకం సాగుతుందన్నారు.