రష్యా, ఉక్రెయిన్ మధ్య గత కొంతకాలంగా యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కీవ్‌లో కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఉక్రెయిన్‌కు జీ7 దేశాల నాయకులు అండగా నిలిచారు. ఉక్రెయిన్ ఆర్థిక, సైనిక పునర్నిర్మాణానికి సుమారు 50 బిలియన్ డాలర్ల రుణం అందించనున్నట్లు వారు ప్రకటించారు. రష్యా తన యుద్ధాన్ని ముగించి.. ఉక్రెయిన్‌కు జరిగిన నష్టాన్ని చెల్లించాలని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.