TG: తిరుపతిలోని రాజ్‌పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హోటల్లో తనిఖీలు చేపట్టారు. కాగా, నిన్న తిరుపతిలోని నాలుగు ప్రైవేటు హోటళ్లను పేల్చివేస్తామని హెచ్చరికలు వచ్చాయి. తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఎక్కడా పేలుడు పదార్థాలు దొరకలేదు. తిరుపతి విమానాశ్రయంలో స్టార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి కూడా నిన్న బెదిరింపు కాల్ వచ్చింది.