నిజామాబాద్: నగరంలో USFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిద్ధల నాగరాజు, పెద్ది సూరి మాట్లాడుతూ.. బకాయిలు దాదాపు 8000 కోట్లు ఉన్నాయని వారు ఆరోపించారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు.