GDWL: అల్లంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను కేంద్రమంత్రి కుమారస్వామి సతీమణి అనిత సోమవారం దర్శించుకున్నారు. జోగులాంబ అమ్మవారికి, బాలబ్రహ్మేశ్వరస్వామికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈవో పురేందర్ కుమార్, ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, అర్చకులు ఆనంద శర్మ ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.