NZB: ఖీల్లా డిచ్పల్లి గ్రామంలో ఊర పండుగ ఆదివారం నాడు గ్రామ దేవతలకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజుల ప్రత్యేక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోత లింగన్న ఆలయం నుంచి ఊరేగింపుగా డప్పు వాయుద్యాలతో వెళ్లి గ్రామ దేవతలకు పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. పంటలు బాగా పండాలని కోరారు.