AP: శాసనసభ కనీసం 15 రోజులైనా జరగాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. విశాఖలోని రుషికొండలో ప్రజాధనం దుర్వినియోగంతో కట్టిన రుషికొండపై చర్చ జరగాలని అన్నారు. శాసన సభ్యులంతా ఒక రాజు రుషికొండ పర్యటన చేపట్టాలని బీఏసీ సమావేశంలో కోరారు. కాగా, బీఏసీ సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు.