TG: HYDలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. విద్యానగర్‌లోని కింగ్స్ బార్, RTC X రోడ్స్‌లోని వింటేజ్, చిక్కడపల్లి మధిరాలయ, కొత్తపేటలోని కృతుంగ రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. FSSAI నిబంధనలకు విరుద్ధంగా బార్ల నిర్వహణ, కిచెన్‌లో బొద్దింకలను అధికారులు గుర్తించారు. రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేసి కేసు నమోదు చేశారు.