TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు గైర్హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా విచారణకు రాలేనని జూబ్లీ హిల్స్ ఏసీపీకి సమాచారం ఇచ్చారు. ఈ నెల 14న విచారణకు హాజరవుతానని లింగయ్య తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. కాగా, నిందితుడు తిరుపతన్నతో ఫోన్ కాంటాక్ట్స్ ఉండటంతో.. జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని లింగయ్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.