అయోధ్య రామాలయానికి ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులు జారీ చేశాడు. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(SFJ) సంస్థ విడుదల చేసిన వీడియోలో, ఈనెల 16, 17వ తేదీల్లో దాడి చేస్తామంటూ పన్నూ హెచ్చరించాడు. ఈ వీడియోను కెనెడాలోని బ్రాంప్టన్లో రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. హింసాత్మక హిందుత్వ భావజాలం పుట్టిన అయోధ్య పునాదులను కదిలిస్తామని ఆ వీడియోలో పన్నూ హెచ్చరించాడు.