ఢిల్లీ వెళ్లిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో కేటీఆర్ అమృత్ టెండర్ల అంశంపై కేంద్ర మంత్రికి విజ్ఞాపన పత్రం అందించారు. అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. కేవలం రూ.2 కోట్ల లాభం చూపించిన కంపెనీకి రూ.1137 కోట్ల ప్రాజెక్టా? అని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.