TG: డా.పి.సతీష్ కుమార్ సమాజ సేవకు అంకితమై 35 సం.రాలు పూర్తి చేసుకున్నందుకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. విద్య, వైద్య సేవల్లో క్రిస్టియన్ మిషినరీల కృషి అభినందనీయమన్నారు. క్రిస్టియన్ మిషనరీలు నిర్వహిస్తున్న ఆసుపత్రులు ఆదర్శనీయమన్నారు. కల్వరి టెంపుల్‌ను అంత గొప్పగా నిర్వహించడం సతీష్‌కు మాత్రమే సాధ్యమైందన్నారు. భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.