కొత్త సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటి రోజే 45 కేసులు విచారించారు. సీజేఐగా ప్రమాణం చేసిన తరువాత మొదటి సారి హాలులోకి వచ్చిన ఖన్నాకు న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2.30గం.ల వరకు సంజీవ్ ఖన్నా లిస్ట్ చేసిన 45 అంశాలపై విచారణ జరిపారు. వీటిలో ఎక్కువగా వాణిజ్యపరమైన వివాదాలే ఉన్నాయి.