TG: పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు అప్పీలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్పై న్యాయవాది ప్రభాకర్ రావు వాదనలు వినిపించారు. కాగా, విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.